గురువారం 29 అక్టోబర్ 2020
Medchal - Oct 01, 2020 , 06:49:39

మల్లారెడ్డి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు

మల్లారెడ్డి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు

మేడ్చల్‌ రూరల్‌ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల మెయిన్‌ క్యాంపస్‌కు చెందిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అంతర్జాతీయ స్థాయి సంస్థ హ్యాకర్స్‌ ఇటీవల పైథాన్‌ కోడింగ్‌ పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో పాల్గొన్న ఐటీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సిద్దార్థ్‌, నకుల్‌రెడ్డి, శ్రీకాంత్‌ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆ విద్యార్థులను కళాశాల వ్యవస్థాపక చైర్మన్‌, కార్మిక శాఖ మంత్రి  మల్లారెడ్డి, డైరెక్టర్‌ డైరెక్టర్‌ రామస్వామి రెడ్డి కళాశాలలో బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైథాన్‌ కోడింగ్‌ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 11,19,600 మంది విద్యార్థులు పాల్గొనగా, సిద్దార్థ్‌ 2304 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడన్నారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఐటీ విభాగాధిపతి కణ్ణన్‌, బోధనా సిబ్బందిని అభినందించారు. logo