బుధవారం 05 ఆగస్టు 2020
Medchal - Jul 05, 2020 , 00:37:20

మౌలిక వసతుల కల్పనే ధ్యేయం

మౌలిక వసతుల కల్పనే ధ్యేయం

 గాజులరామారం : ప్రతి కాలనీ, బస్తీలో మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. శనివారం గాజులరామారం డివిజన్‌ పరిధిలోని మిథిలానగర్‌ పార్కును  కార్పొరేటర్‌ రావుల శేషగిరితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రూ.20.50 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మంత్రి కేటీఆర్‌ సహకారంతో వేల కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.  కార్యక్రమంలో మిథిలానగర్‌ పార్కు సొసైటీ సభ్యులు అచ్యుత్‌, సురేశ్‌కుమార్‌, కిరణ్‌, చక్రవర్తి, మురళి, శివాజీ, విజయ్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo