మంగళవారం 20 అక్టోబర్ 2020
Medchal - Sep 20, 2020 , 01:15:24

మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు

మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు

మంత్రి మల్లారెడ్డి.. పోచారంలో ఒకే రోజు రూ. 2.65 కోట్లతో అభివృద్ధి పనులు

ఘట్‌కేసర్‌: మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారంలో శనివారం పలు వార్డుల్లో ఒకేరోజు రూ. 2.65 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 1వ వార్డు శ్రీనివాస్‌నగర్‌కాలనీలో రూ. 27.50 లక్షలతో బీటీ రోడ్డు , రూ. 26.50 లక్షలతో పార్కు ప్రహరీ నిర్మాణం, 2వ వార్డులో రూ. 15.50 లక్షలతో భూగర్భ డ్రైనేజీ, రూ. 5 లక్షలతో టాయిలెట్లు, 3వ వార్డులో రూ. 9 లక్షలతో బీటీ, 4వ వార్డులో రూ. 33.50 లక్షలతో ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌కాలనీలో నూతన డ్రైనేజీ నిర్మాణం, 6వ వార్డు దివ్యాంగుల కాలనీలో రూ. 32 లక్షలతో  ట్రీ పార్కు, డ్రైనేజీ, 7వ వార్డులో రూ. 15 లక్షలతో పార్కు స్థలానికి ప్రహరీ, 8వ వార్డులో రూ. 30 లక్షలతో సంపు స్థలానికి గోడ, పచ్చదనం ఏర్పాటు, 9వ వార్డులో రూ. 40 లక్షలతో  పార్కులో గోడ నిర్మాణం, మొక్కల పెంపకం, 10వ వార్డులో రూ. 30 లక్షలతో పార్కు స్థలానికి ప్రహరీ, పచ్చదనం పెంపకం వంటి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మంత్రి.. వార్డుల్లో మొక్కలు నాటారు. తెలంగాణ అన్ని రంగా ల్లో అభివృద్ధి సాధిస్తూ.. ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. ఆయా కార్యక్రమా ల్లో పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రెడ్యానాయక్‌ పాల్గొన్నారు. 


logo