శుక్రవారం 15 జనవరి 2021
Medchal - Dec 05, 2020 , 02:31:51

హస్తం.. అయోమయం

హస్తం.. అయోమయం

149 స్థానాల్లో పోటీ.. 2 స్థానాల్లో గెలుపు

రేవంత్‌రెడ్డి వర్గానికి భంగపాటు

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పరాభవం తప్పలేదు. మొత్తం 150 డివిజన్లకు 149 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను బరిలో నిలపగా, కేవలం ఏఎస్‌ రావు నగర్‌, ఉప్పల్‌ డివిజన్లలో మాత్రమే గెలిచారు. 2016లోఎన్నికల్లో కూడా కేవలం పటాన్‌చెరు, నాచారం డివిజన్లలో మాత్రమే కాంగ్రెన్‌ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ కాలక్రమంలో వాళ్లిద్దరూ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ దఫా గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లోనూ 2016 ఫలితాలే పునరావృతం (ఉప్పల్‌, ఏఎస్‌రావు డివిజన్లు) కావడంతో కాంగ్రెస్‌ క్యాడర్‌ పూర్తిగా నిస్తేజంలో మునిగింది. ఎంపీ రేవంత్‌ రెడ్డి గ్రేటర్‌ ఎన్నికల బాధ్యతను మోసినా.. పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఆయన శిబిరానికి భంగపాటు తప్పలేదు. 75-80 స్థానాల్లో కనీసం డిపాజిట్‌ కూడా దక్కలేదు.