శుక్రవారం 07 ఆగస్టు 2020
Medchal - Jul 05, 2020 , 23:21:00

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

 పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ 

కుత్బుల్లాపూర్‌ : పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. ఆదివారం నియోజకవర్గం పరిధిలోని 18 మంది లబ్ధిదారులకు చింతల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద ఆడబిడ్డల పెండ్లికి ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని తెలిపారు. 

 ఎమ్మెల్యేకు వినతి..

 దుండిగల్‌ :   గాజులరామారం సర్కిల్‌, సూరారం డివిజన్‌ పరిధిలోని శ్రీకృష్ణానగర్‌కు చెందిన సంక్షేమసంఘం ప్రతినిధులు బస్తీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే మంచినీటి పైపులైన్‌ పనులు పూర్తి అయ్యాయని, మిగతా ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌, జీడిమెట్ల డివిజన్‌ పరిధి, మర్రినారాయణరెడ్డి నగర్‌లో నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంక్షేమసంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. 

హరితహారం, కరోనా బాధితుల సహాయార్థం రూ.లక్ష విరాళం 

నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ 2వ వార్డు కార్పొరేటర్‌ చిట్ల దివాకర్‌   ట్రీగార్డుల ఏర్పాటుకు, కరోనా వైరస్‌ బాధితుల సహాయార్థం రూ.1లక్ష చెక్కును ఆదివారం కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌కు అందజేశారు.  


logo