మంగళవారం 19 జనవరి 2021
Medchal - Dec 05, 2020 , 02:31:49

చేపల కోసం వెళ్లి.. విద్యుత్‌ షాక్‌కు గురై యువకుడు మృతి

 చేపల కోసం వెళ్లి.. విద్యుత్‌ షాక్‌కు గురై యువకుడు మృతి

 మేడ్చల్‌:  చేపలు పట్టడానికి వెళ్లిన ఓ యువకుడు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మండలం, రాయిలాపూర్‌ గ్రామానికి చెందిన జల్లి మహేందర్‌ (27) వ్యవసాయం చేస్తున్నాడు. కాగా..చేపలు పట్టడానికి గురువారం రాత్రి గ్రామ చెరువుకు వెళ్లాడు. చేపలు పడుతుండగా.. చెరువు పక్కన ఉన్న విద్యుత్‌ తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. చేపల కోసం వెళ్లిన వ్యక్తి ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం చెరువు వద్ద గాలిస్తుండగా.. అక్కడ మహేందర్‌ మృతి చెంది కనిపించాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మేడ్చల్‌ ప్రభుత్వ దవాఖానలోని మా ర్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.