ఆదివారం 05 జూలై 2020
Medchal - Jul 01, 2020 , 00:31:39

సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వండి

సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వండి

ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

మల్కాజిగిరి: సమస్యలు ఉంటే ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వాలని మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు విజ్ఞప్తి చేశారు. సమస్యలను ప్రజలు ఫోన్‌ ద్వారా తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే  పరిష్కారానికి అధికారులను అప్రమత్తం చేస్తామన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాధి అనేక మందికి వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. భౌతికదూరం పాటిస్తూ పనులు చేసుకోవాలన్నారు. సమస్యలను తన ఫోన్‌ నంబర్‌ 9010428999 కు ఎస్‌ఎంఎస్‌ చేయాలన్నారు. 8897573999, 9550330269 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. కరోనా వైరస్‌ నియంత్రణకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. నియంత్రిత ప్రాంతాల్లో ఆరోగ్య పరీక్షలను వైద్య బృందాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాప్తి చెందదని ఎమ్మెల్యే తెలిపారు. 


logo