బుధవారం 21 అక్టోబర్ 2020
Medchal - Jun 09, 2020 , 00:05:17

వివాహేతర సంబంధం ప్రాణాలను బలితీసుకుంది

వివాహేతర సంబంధం ప్రాణాలను బలితీసుకుంది

దుండిగల్‌ : వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సంగారెడ్డి జిల్లా, పెద్ద శంకరంపేట మండలం, గొట్టిముక్కల గ్రామానికి చెందిన యాదయ్య(40), మరియమ్మ దంపతులు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. గతేడాది బతుకుదెరువు కోసం వచ్చి నిజాంపేట కార్పొరేషన్‌ ప్రగతినగర్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో యాదయ్య మరోచోట వాచ్‌మన్‌గా పనిచేస్తూ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగు తున్నాయి. 

గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టగా రాజీ కుదిరింది. కొన్ని రోజులుగా మళ్లీ ప్రియురాలితో సంబంధం కొనసాగిస్తుండడంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో  ప్రియురాలికి ఫోన్‌చేసి తాను చనిపోతున్నానని చెప్పి తాడుతో ఉరి వేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీదవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


logo