కొనసాగుతున్న ఫీవర్‌ సర్వే

మేడ్చల్‌,మే 7: మేడ్చల్‌ నియోజకవర్గం లో శుక్రవారం రెండోరోజు ఫీవర్‌ సర్వే కొనసాగింది. వైద్యారోగ్య సిబ్బంది, మున్సిప ల్‌, పంచాయతీ సిబ్బంది, ఆశకార్యకర్తలు, రిసోర్స్‌ పర్సన్స్‌తో కలిపి ఏర్పాటు చేసి బృందాలు ఇంటింటికీ తిరిగి కరోనా లక్షణా లు ఉన్న వారిని గుర్తించి మెడికల్‌ కిట్లను అందజేశారు. మున్సిపల్‌, మండల పరిషత్‌ అధికారులు, వైద్యాధికారులు పర్యవేక్షణలో సర్వే చేయగా, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో, జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో చేపట్టిన సర్వేను అదనపు కలెక్టర్‌ జాన్‌శ్యాంసన్‌ పరిశీలించారు.

సర్వేకు ప్రజలు సహకరించాలి..

శామీర్‌పేట,మే 7: కరోనా కట్టడి కోసం చేపడుతున్న సర్వేకు ప్రజలు సహకరించాలని మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంస న్‌ సూచించారు. జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేను పరిశీలించారు. ప్రతి ఇంటిని సందర్శించి చిన్నా పెద్ద అందరినీ సర్వే చేయాలన్నారు. కాలనీలు, వార్డుల వారీగా ప్రజల కు అవగాహన కల్పించి కరోనా కట్టడికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఉమ్మడి శామీర్‌పేట మండలంలోని తూంకుంట మున్సిపాలిటీ, శామీర్‌పేట, మూడుచింతల్‌పల్లి మండలాల్లో వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే చేపట్టారు. కార్యక్రమంలో జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ గోపి, మేనేజర్‌ నాగేశ్‌, వైద్య సిబ్బంది, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సర్వే పక్కగా ఉండాలి..

మేడ్చల్‌ కలెక్టరేట్‌, మే 7: ఇంటింటి జ్వర సర్వే పక్కగా ఉండాలని కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌ పేర్కొన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో నిర్వహించిన ఫీవర్‌ సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడుతూ..కరోనా లక్షణాలు ఉంటే టెస్ట్‌ చేయించుకోవాల్సిన పనిలేకుండా సర్వే టీమ్‌కు సహకరించి వివరాలు తెలియజేస్తే వారే వైద్య సిబ్బందికి సమాచారం అందజేసి మం దులు పంపిణీ చేస్తారన్నారు. నాగారం మున్సిపాలిటీలోని 105 3 ఇండ్లలో ప్రజలకు సర్వే చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి, కమిషనర్లు వాణి రెడ్డి, స్వామి, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కీసరలో..

కీసర మండలంలోని 10 గ్రామ పంచాయతీలలో రెండో రోజు ఇంటింటి సర్వే నిర్వహించారు. సర్పంచ్‌లు, మండల అధికారులు సర్వేను పరిశీలించారు. కీసర తదితర గ్రామాల్లో చేపట్టిన సర్వేను మండల పంచాయతీ అధికారి మంగతయారు పరిశీలించారు.

ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల్లో..

ఘట్‌కేసర్‌,మే 7: ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీలో అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి ఆరోగ్య విషయాలను నమోదు చేసుకున్నారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌ పావనీజంగయ్య యాదవ్‌, కమిషనర్‌ వసంత, పోచారం ము న్సిపాలిటీలో చైర్మన్‌ కొండల్‌రెడ్డి, కమిషనర్‌ సురేశ్‌ ఆధ్వర్యంలో అధికారులు, ఆరోగ్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి సర్వే చేశా రు. ప్రతి ఇంటికి వెళ్లి జ్వర పరిక్షలు నిర్వహించి కరోనా సోకిన వ్యక్తులు, లక్షణాలు వారి వివరాలను తీసుకున్నారు. అవసరమైన వారికి వైద్య సిబ్బంది మందులు పంపిణీ చేశారు.

మేడ్చల్‌ మండలంలో..

మేడ్చల్‌ రూరల్‌, మే 7 : మేడ్చల్‌ మండల పరిధిలోని 17 పంచాయతీలు, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో కార్మికులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లోని 950 కుటుంబాలను సర్వే చేయగా 33మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి మెడికల్‌ కిట్లను అందజేసినట్టు డాక్టర్‌ నళిని తెలిపారు. కాగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో 17 80 కుటుంబాలను సర్వే చేయగా ముగ్గురికి లక్షణాలు కన్పించాయి. సర్వే జరుగుతున్న విధానాన్ని కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి పరిశీలించారు.

బోడుప్పల్‌ కార్పొరేషన్‌లో..

బోడుప్పల్‌, మే 7 : బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 15 బృందాలు ఇంటింటి సర్వే చేపట్టాయి. వైద్యాధికారి సుజాత పర్యవేక్షణలో చేపట్టిన ఈ సర్వేలో జ్వర లక్షణాలు ఉన్నవారికి మెడికల్‌ కిట్లను అందజేశారు. పలు డివిజన్లలో చేపట్టిన ఈ సర్వేను కార్పొరేటర్లు పరిశీలించారు.