మంగళవారం 27 అక్టోబర్ 2020
Medchal - Oct 01, 2020 , 07:03:10

సంక్షేమాన్ని వివరించండి.. ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

సంక్షేమాన్ని వివరించండి.. ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

 వినాయక్‌నగర్‌ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి అందరూ కృషిచేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం ఉదయం శ్రీకాలనీలోని వినాయక్‌నగర్‌ డివిజన్‌ కార్యాలయలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. 2017 సంవత్సరం కంటే ముందుగా డిగ్రీ, ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన పట్టభద్రులను కలిసి ఓటరుగా తమపేర్లను నమోదు చేసుకునే మాదిరిగా వారిని ప్రోత్సహించాలని అన్నారు. డిగ్రీ పాస్‌ సర్టిఫికెంట్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, ఓటర్‌ ఐడీ కార్డు, రెండు పాస్‌ పోర్టు సైజ్‌ ఫొటోలను జతచేయాలని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ బద్దం పుష్పలతారెడ్డి, నియోజకవర్గం ఇన్‌చార్జి బద్దం పరశురాంరెడ్డి, సర్కిల్‌ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్‌, రంపె చంద్రమౌళి, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుడిని సన్మానించిన ఎమ్మెల్యే

 మల్కాజిగిరి : పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బండ జనార్దన్‌రెడ్డికి మల్కాజిగిరిలో బుధవారం జరిగిన అభినందనసభలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాల్గొని ఘనంగా సన్మానించారు. అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌, రామేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌ నాయకులు పిట్ల శ్రీనివాస్‌, ప్రేమ్‌కుమార్‌, లక్ష్మీకాంత్‌రెడ్డి, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

 మల్కాజిగిరి సర్కిల్‌ ఈస్ట్‌ఆనంద్‌బాగ్‌ డివిజన్‌ ఉప్పర్‌గూడ, సంజయ్‌గాంధీ నగర్‌ కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు కాలనీవాసులు విన్నవించారు. డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సమస్యను పరిష్కరించాలని విన్నవించగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాలనీవాసులకు హామీ ఇచ్చారు.

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

 వినాయక్‌నగర్‌ : ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం ఉదయం మచ్చ బొల్లారంలోని కౌకుర్‌ దగ్గరలో కొత్తగా వెలసిన మల్లికార్జున్‌నగర్‌ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరారు. ఈ కార్యక్రమంలో డీఈ మహేశ్‌, వాటర్‌ వర్క్స్‌ డీజీఎం రజిని, స్ట్రీట్‌ లైట్స్‌ ఏఈ స్వాతి కార్పొరేటర్‌ రాజ్‌ జీతేంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo