మంగళవారం 14 జూలై 2020
Medchal - Jun 06, 2020 , 00:35:13

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌

ప్రతి ఒక్కరూ  మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌

జీడిమెట్ల : కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చింతల్‌లోని  క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు.  టీఆర్‌ఎస్‌ నాయకుడు చౌడ శ్రీనివాస్‌రావు, జేకే శేఖర్‌యాదవ్‌ పాల్గొన్నారు. 

దుండిగల్‌ : నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి 14వ వార్డులో మేయర్‌ కొలన్‌ నీలాగోపాల్‌రెడ్డి పారిశుధ్య నిర్వహణపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వైకుంఠధామంలో మొక్కలు నాటారు .కార్యక్రమంలో కమిషనర్‌ గోపి, కార్పొరేటర్‌ రాజేశ్వరి పాల్గొన్నారు.

ఘట్‌కేసర్‌ : మండల పరిధిలోని చౌదరిగూడ గ్రామ ప్రభుత్వ నర్సరీని జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి సందర్శించారు. పచ్చదనంతోనే వాతావరణం కలుషితం కాకుండా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.  ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌  రమాదేవి పాల్గొన్నారు. 

ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావనీ జంగయ్య యాదవ్‌ 15 వ వార్డులో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కమిషనర్‌ వసంత, వైస్‌చైర్మన్‌ మాధవరెడ్డి పాల్గొన్నారు. 

కీసర : మండల పరిధిలోని భోగారం గ్రామంలోని పార్కులో డీఆర్‌డీఏ పీడీ జ్యోతి, ఎంపీడీవో పద్మావతి కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గౌతమి పాల్గొన్నారు.

కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలి 

 జీడిమెట్ల : కొవిడ్‌ -19 నిబంధనలను పాటిస్తూ తమ వ్యాపారాలను కొనసాగించాలని కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు మంగతాయారు, రవీందర్‌కుమార్‌ సూచించారు. శుక్రవారం కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్బర్‌ అభియాన్‌ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా వీధి వ్యాపారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉప కమిషనర్లు మాట్లాడుతూ ప్రతి వీధి వ్యాపారికి రూ.10 వేల రుణాన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో జీడిమెట్ల సీఐ బాలరాజు, ట్రాఫిక్‌ సీఐ సత్యనారాయణ, టౌన్‌ప్లానింగ్‌ అధికారి రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

నిత్యావసర సరుకులు పంపిణీ..

మేడ్చల్‌ రూరల్‌ : టీఆర్‌ఎస్‌ నేత మద్దుల శ్రీనివాస్‌రెడ్డి జన్మదినం సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 5వ వార్డులో నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డితో కేక్‌ కట్‌ చేయించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ భాస్కర్‌యాదవ్‌,  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, వైస్‌చైర్మన్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

 మేడ్చల్‌ కలెక్టరేట్‌ : దమ్మాయిగూడ మున్సిపల్‌ పరిధిలోని ఆర్‌సీ ఎన్‌క్లేవ్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి నిత్యావసర సరుకులను కౌన్సిలర్‌ సరిత అందజేశారు. 


logo