గురువారం 22 అక్టోబర్ 2020
Medchal - Aug 12, 2020 , 00:06:59

హెచ్‌సీయూ ప్రొఫెసర్‌కు ఏరాస్మస్‌ ప్లస్‌

హెచ్‌సీయూ ప్రొఫెసర్‌కు ఏరాస్మస్‌ ప్లస్‌

 ఇంటర్నేషనల్‌ క్రెడిట్‌ మొబిలిటీ గ్రాంట్‌

కొండాపూర్‌ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లోని సెంటర్‌ ఫర్‌ న్యూరల్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్సెస్‌ విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ రమేష్‌ మిశ్రా, నెదర్లాండ్స్‌లోని లైడెన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ నైల్స్‌ షిల్లర్‌ సంయుక్తంగా కలిసి ప్రతిష్టాత్మక ఏరాస్మస్‌ ప్లస్‌ ఇంటర్నేషనల్‌ క్రెడిట్‌ మొబిలిటీ గ్రాంట్‌ (2020 -2023)కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని వర్సిటీ పీఆర్‌ఓ ఆశీష్‌  మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ గ్రాంట్‌ ద్వారా చేకూరే 24వేల యూరోలు విద్యార్థులు, అధ్యాపకుల శిక్షణ, జ్ఞానాన్ని పెంపొందించేలా ఇరు వర్సిటీల ల్యాబ్‌లను సందర్శించేందుకు ఉపయోగిస్తారని అన్నారు. దీంతో పాటుగా ఈ  కార్యక్రమం కొనసాగినంత కాలం చలనశీలత, ఇతర కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. ప్రొఫెసర్‌ మిశ్రా, ప్రొఫెసర్‌ షిల్లర్‌లు సంయుక్తంగా డ్యూయో -ఇండియా ప్రొఫెసర్‌ ఫెలోషిప్‌ అవార్డులను అందుకున్నట్లు తెలిపారు. 


logo