శనివారం 05 డిసెంబర్ 2020
Medchal - Jul 23, 2020 , 00:06:17

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

 పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్లు 

 మేడిపల్లి :  సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బుధవారం పీర్జాదిగూడ నగరపాలక పరిధిలోని బీజేపీ కార్పొరేటర్‌ తూంకుంట ప్రసన్నలక్ష్మీ శ్రీధర్‌రెడ్డి, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు బండారి మంజుల రవీందర్‌, కొల్తూరి మహేశ్‌,  పోచయ్య, నాయకులు బొడిగె రాందాస్‌గౌడ్‌ మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్‌, డిప్యూటీ మేయర్‌ కుర్ర శివకుమార్‌గౌడ్‌, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. 

 బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో..

బోడుప్పల్‌ :  బోడుప్పల్‌ 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ దానగళ్ల అనితాయాదగిరి దంపతులు బుధవారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.  కార్యక్రమంలో మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్‌ కొత్త లక్ష్మీగౌడ్‌, కార్పొరేటర్లు జంగయ్య యాదవ్‌, నర్సింహ, పట్టణ అధ్యక్షుడు చెర్ల ఆంజనేయులు నాయకులు పాల్గొన్నారు. 

శామీర్‌పేట :  మూడుచింతలపల్లి మండలం పోతారం గ్రామానికి చెందిన జే.మయూరికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.42 వేల చెక్కును క్యాంపు కార్యాలయంలో మంత్రి బుధవారం అందజేశారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, యూత్‌ ఉపాధ్యక్షుడు పవన్‌ముదిరాజ్‌,  పోతారం శ్రీకాంత్‌రెడ్డి, జయకుమార్‌, లావణ్య పాల్గొన్నారు.