గురువారం 22 అక్టోబర్ 2020
Medchal - Aug 19, 2020 , 00:25:37

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి

అల్వాల్‌ : నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలోని పలు ప్రాం తాల్లో రూ. కోటి 57 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలోని మచ్చబొల్లారం  వైట్‌ టాప్‌రోడ్డు , సీసీరోడ్డు, భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అల్వాల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో 95 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్‌ జితేందర్‌ నాథ్‌, చింతల శాంతి శ్రీనివాస్‌ రెడ్డి, వెంకటాపూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు అనిల్‌ కిశోర్‌గౌడ్‌, అల్వాల్‌ డిప్యూటీ కమిషనర్‌ తిప్పర్తి యాదయ్య, తహసీల్దార్‌ నాగమణి, వాటర్‌ వర్క్స్‌ అధికారి రజినీ, ఈఈ రాజు, డీఈ మహేశ్‌, అధికారులు జలందర్‌రెడ్డి, లక్ష్మి, టీఆర్‌ఎస్‌ నాయకులు సురేందర్‌, శ్రీనివాసులు, ఉదయ్‌కుమార్‌, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు. 


logo