బుధవారం 28 అక్టోబర్ 2020
Medchal - Sep 22, 2020 , 00:55:20

ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించండి

ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించండి

మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

మేడ్చల్‌ కలెక్టరేట్‌ : మున్సిపాలిటీ, గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు, ఎంపీడీఓలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్‌ టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లెక్సీలు, చాటింపుల ద్వారా ప్రచారం చేసి ప్లాట్ల యజమానులు ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకునే విధంగా చైతన్యపరచాలని అన్నారు. మున్సిపాలిటీ, గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

 ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

శామీర్‌పేట: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు.  సోమవారం శామీర్‌పేట మండలం పరిధిలోని యాడారం గ్రామంలో జడ్పీటీసీ అనిత, గ్రామ సర్పంచ్‌ సుజాతతో కలిసి 27 మొక్కలు నాటారు.  


logo