సోమవారం 26 అక్టోబర్ 2020
Medchal - Sep 22, 2020 , 01:01:42

ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి: ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి

ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి: ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి

చర్లపల్లి, సెప్టెంబర్‌ 21 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌లో 112మందికి కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక కార్పొరేటర్‌ పావనీమణిపాల్‌రెడ్డి, కాప్రా మండలం తహసీల్దార్‌ గౌతంకుమార్‌లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ కొత్త రామారావు, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బేతాల బాల్‌రాజు, సురేందర్‌రావు, నాయకులు మణిపాల్‌రెడ్డి, జాండ్ల ప్రభాకర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, బొలంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, గరిక సుధాకర్‌, శ్రీనివాస్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. logo