టీఆర్ఎస్ హయాంలో.. గ్రామాలు.. నందన వనాలు

పూడూరు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్ రూరల్ : సీఎం కేసీఆర్ సారధ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం స్వచ్ఛ గ్రామాలకు రూపకల్పన చేసిందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని పూడూరు గ్రామంలో బుధవారం సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా రూ.49 లక్షలతో చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులను ఆయన జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఈటబోయిన బాబు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ గ్రామాలను నందనవనాలుగా తీర్చిదిద్దుతున్నదని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలతో జిల్లాలోని 61 గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరిసిందని, చెత్తా చెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు ట్రాక్టర్, యంత్రాలను సమకూర్చడంతో పరిశుభ్రంగా మారాయన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయడంతో స్వచ్ఛత సాధ్యపడిందన్నారు. ఎంపీపీ పద్మాజగన్‌రెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయానంద్రెడ్డి, హెచ్ఆర్ మేనేజర్ రాములు నాయక్, ఎంపీటీసీ నీరుడి రఘు, ఉప సర్పంచ్ జ్యోతి చంద్రశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
పట్టభద్రుల నమోదు జాబితా మంత్రికి అందజేత
ఘట్కేసర్: పోచారం మున్సిపాలిటీ పట్టభద్రుల నమోదు జాబితాను మంత్రి మల్లారెడ్డికి స్థానిక టీఆర్ఎస్ నాయకులు బుధవారం అందజేశారు. మున్సిపాలిటీ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు గొంగళ్ల బాలేశ్ ఆధ్వర్యంలో ఈ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 705 మంది అర్హత గల పట్టభద్రులు నమోదు చేసుకున్నట్లు టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు బాలేశ్ మంత్రికి తెలియజేశారు. టీఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి, నర్రి కాశయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పది అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు
- చోరీ తమిళనాడులో.. దొరికింది హైదరాబాద్‌లో..
- ల్యాండ్ మాఫియాపై చర్యలు తీసుకోండి: మెహబూబా ముఫ్తీ
- ఎన్నికల్లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకోవాలా? : ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు
- ఇది అత్యత్తమ పోలీస్ శిక్షణ కళాశాల
- శ్రీసుధకు సినిమాటోగ్రాఫర్ నుండి ప్రాణహాని!
- కాఫీతో యాంగ్జైటీ పెరుగుతుందా..?
- తమిళ ప్రజలపై మోదీకి గౌరవం లేదు: రాహుల్‌గాంధీ
- క్యాపిటల్ హిల్‌కు జెట్‌లో వెళ్లింది.. ఇప్పుడు లీగల్ ఫీజుల కోసం వేడుకుంటోంది !
- మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు