శనివారం 31 అక్టోబర్ 2020
Medchal - Sep 22, 2020 , 00:49:37

అభివృద్ధి పనులను పర్యవేక్షించాలి

అభివృద్ధి పనులను పర్యవేక్షించాలి

   మాధవరం కృష్ణారావు 

 కూకట్‌పల్లి : డివిజన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులను కార్పొరేటర్లు పర్యవేక్షిస్తుండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధికి చెందిన అన్ని డివిజన్‌ల కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి డివిజన్‌లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, పనులను నాణ్యతా ప్రమాణా లు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజవర్గం కో ఆర్డినేటర్‌ సతీష్‌ అరోరా, కార్పొరేటర్లు తూము శ్రావణ్‌ కుమార్‌, జూపల్లి సత్యనారాయణ, పండాల సతీశ్‌గౌడ్‌, కాండూరి నరేంద్ర చార్యా, తరుణి నాయీ, మందాడి శ్రీనివాస్‌రావు, డివిజన్ల అధ్యక్షులు సాధు ప్రతాప్‌రెడ్డి, ఇర్ఫాన్‌, సుధాకర్‌రెడ్డి, కూన అమ్రేశ్‌ గౌడ్‌, భిక్షపతి, అడుసుమల్లి వెంకటేశ్వర్‌రావు, సత్యం, లింగాల ఐలయ్య, మాజీ కార్పొరేటర్‌ బాబురావు, హరినాథ్‌ పాల్గొన్నారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ.. 

 నియోజకవర్గానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే కృష్ణారావు సోమవారం అందజేశారు.

 26 కులాలను బీసీ జాబితాలో చేర్చాలి..

 బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో శ్రీకాకుళం, తదితర జిల్లాలకు చెందిన వేలాది మంది నివాసం ఉంటున్నారని, ఆయా జిల్లాలకు సంబంధించిన 26 కులాలను తెలంగాణలో బీసీ జాబితాలో కొనసాగించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.  

 పాండురంగానగర్‌ కాలనీలో.. 

  మూసాపేట్‌ డివిజన్‌ పరిధిలోని పాండురంగానగర్‌ కాలనీలో రూ. 7 లక్షలతో నిర్మించిన గ్రంథాలయం హాల్‌ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం స్థానిక కార్పొరేటర్‌ తూము శ్రావణ్‌ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు సీహెచ్‌. సత్యనారాయణ, డివిజన్‌ అధ్యక్షుడు సత్యం, పాండురంగా నగర్‌ అధ్యక్షుడు ఇంద్రజీత్‌, లక్ష్మారెడ్డి, రమేశ్‌ నాయక్‌, వంజరి వెంకటేశ్‌, అబ్బులు, తిరుపతి, జోసెఫ్‌, తదితరులు పాల్గొన్నారు.