శనివారం 31 అక్టోబర్ 2020
Medchal - Sep 23, 2020 , 00:42:48

సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి

సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చౌదరిగూడలో మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్‌  

 మేడ్చల్‌ కలెక్టరేట్‌ : సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డులలో మంగళవారం మంత్రి రూ. 52 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.  కార్యక్రమంలో కలెక్టర్‌   వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్‌చైర్మన్‌ వెంకటేశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌  చంద్రారెడ్డి, కమిషనర్‌ ఎ.వాణి రెడ్డి, వైస్‌చైర్మన్‌  మల్లేశ్‌ యాదవ్‌, కౌన్సిలర్లు,  కో-ఆప్షన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

 కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ 

కీసర: కీసర  తహసీల్దార్‌ కార్యాలయంలో 120 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను జిల్లా కలెక్టర్‌  వాసం వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి  మల్లారెడ్డి  పంపిణీ చేశారు. కార్యక్రమంలో  ఆర్డీవో రవి,  ఎంపీపీ ఇందిర, వైస్‌చైర్మన్‌ జె.సత్తిరెడ్డి, దమ్మాయిగూడ చైర్మన్‌ ప్రణీతగౌడ్‌, సర్పంచ్‌లు  మాధురి వెంకటేశ్‌, మహేందర్‌రెడ్డి, పెంటయ్య,ఆండాలు, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి,ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నేతలుపాల్గొన్నారు. 

మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ..

ఘట్‌కేసర్‌: గ్రామాల అభివృద్ధితోనే  స్వరాజ్యం సిద్ధిస్తున్నదని పిలుపునిచ్చిన గాంధీజీ కన్న కలలను నేడు సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నారని మంత్రి  మల్లారెడ్డి అన్నారు.  మండల పరిధిలోని చౌదరిగూడలో దాతలు సర్పంచ్‌ బైరు రమాదేవి, మాజీ సర్పంచ్‌ బైరు రాములు గౌడ్‌ ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి ఆవిష్కరించారు.  అనంతరం  సాదత్‌అలీగూడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహం, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్‌ విజయలక్ష్మి, సర్పంచ్‌ బైరు రమాదేవి, మాజీ సర్పంచ్‌ బైరు రాములు గౌడ్‌, ఎంపీటీసీలు భాస్కర్‌రెడ్డి, రామారావు పాల్గొన్నారు.