కాప్రా: కాప్రాడివిజన్ ఎల్లారెడ్డిగూడలో అక్రమకట్టడాలను కాప్రాసర్కిల్ టౌన్‌ప్లానింగ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం కూల్చివేసింది. జమ్మిగడ్డ చౌరస్తా నుంచి ఎల్లారెడ్డిగూడ వెళ్లే రోడ్డులో అనుమతులు లేకుండా దుకాణాలను నిర్మిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎన్.శంకర్ ఆదేశాల మేరకు సర్కిల్ అసిస్టెంట్ టౌన్‌ప్లానర్ శ్రీధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో టౌన్‌ప్లానింగ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం అక్రమ నిర్మాణాలను జేసీబీతో కూల్చి వేసింది.
ఈ సందర్భంగా ఏసీపీ శ్రీధర్ ప్రసాద్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కూల్చివేయడం జరుగుతుందని హెచ్చరించారు.