బుధవారం 05 ఆగస్టు 2020
Medchal - Aug 01, 2020 , 00:12:26

ఆదుకున్న పార్టీ క్రియాశీలక సభ్యత్వం

ఆదుకున్న పార్టీ క్రియాశీలక సభ్యత్వం

బోడుప్పల్‌ : అకాల మరణంతో అనాథ అయిన ఓ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ పార్టీ క్రియాశీలక సభ్యత్వం అండగా నిలిచింది. బోడుప్పల్‌ నగరపాలక సంస్థ పరిధిలోని బాలాజీహిల్స్‌కు చెందిన దూదేకుల హుస్సేన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ క్రియాశీలక సభ్యుడు. కాగా ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. హుస్సేన్‌ కుంటుంబానికి టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున క్రియాశీలక సభ్యత్వం ఉండడంతో రూ. 2లక్షల బీమా సొమ్మును మంత్రి మల్లారెడ్డి హుస్సేన్‌ భార్య మస్తానమ్మకు క్యాంపు కార్యాలయంలో చెక్కును నాయకుల సమక్షంలో అందజేశారు.మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్‌ బుక్యా సుమన్‌నాయక్‌, తిరుపతిరెడ్డి, ఎలిగొండయ్య పాల్గొన్నారు.


logo