e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి పల్లెప్రగతితో గ్రామాలు మరింత అభివృద్ధి

పల్లెప్రగతితో గ్రామాలు మరింత అభివృద్ధి

పల్లెప్రగతితో గ్రామాలు మరింత అభివృద్ధి
  • జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి
  • పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలను పరిశీలించిన కలెక్టర్‌

కీసర, జూలై 10; ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందని జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి అన్నారు. మండల పరిధిలోని కరీంగూడలో శనివారం ఉదయం పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ శ్వేతా మహంతి గ్రామంలో పర్యటించారు. వైకుంఠథామం, పల్లె ప్రకృతి వనం, నర్సీలను పరిశీలించారు. కరీంగూడ గ్రామం బైఫర్‌కేషన్‌లో రాంపల్లి నుంచి విడిపోయి చిన్న పంచాయతీగా మారిందని, ఈ గ్రామానికి ప్రభుత్వ భూమి అసలే లేదని, రెండు సంవత్సరాల నుంచి డంపింగ్‌యార్డు కోసం స్థలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్‌ కౌకుట్ల గోపాల్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు.

అదేవిధంగా గ్రామానికి 2011 జనాభా ప్రాతిపాదికన 952 బైఫార్మెట్‌ చేయడంతో 482 జనాభాకు మాత్రమే ప్రభుత్వం నుంచి ఫండ్‌ వస్తున్నదని, గ్రామ పరిధిలో ఉన్న భూమి కంటే 350 ఎకరాలు తక్కువ భూమిని గెజిట్‌లో చూపిస్తున్నదని, దీంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం తక్కువగా వస్తుందని గ్రామ రెవెన్యూకు సంబంధించిన మ్యాప్‌ను జిల్లా కలెక్టర్‌కు సర్పంచ్‌ చూయించారు. కలెక్టర్‌ వెంటనే స్పందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేస్తున్నామని, కరీంగూడ గ్రామానికి డంపింగ్‌యార్డు కోసం 150 గజాల ప్రైవేట్‌ స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇస్తుందని తెలిపారు.

- Advertisement -

తక్కువ రెవెన్యూకు సంబంధించిన సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మొక్కల సంరక్షణ కోసం రోడ్డు పక్కల ప్రత్యేక సంరక్షణ జాలీలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి, డీఆర్డీవో పద్మజారాణి, ఎంపీడీవో పద్మావతి, ఎంపీవో మంగతాయారు, ఎంపీపీ ఇందిరా లక్ష్మీనారాయణ, వైస్‌ ఎంపీపీ సత్తిరెడ్డి, సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ మంచాల కిరణ్‌జ్యోతి, ఉప సర్పంచ్‌ మాధవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి దివ్య పాల్గొన్నారు.

హరితహారం లక్ష్యాన్ని అధిగమించాలి

మేడ్చల్‌ రూరల్‌, జూలై 10 : హరితహారం లక్ష్యాన్ని అధిగమించాలని సర్పంచ్‌లు, కార్యదర్శులకు పంచాయతీరాజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ జాన్‌వెస్లీ సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా శనివారం ఆయన మండల పరిధిలోని పూడూరు, గౌడవెల్లి, మునీరాబాద్‌ గ్రామాల్లో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతి ద్వారా ఎన్నో ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో దేవసహాయం, ఎంపీడీవో శశిరేఖ, మండల ప్రత్యేక అధికారి వినోద్‌కుమార్‌, ఎంపీటీసీ నీరుడి రఘు, సర్పంచ్‌లు బాబు యాదవ్‌, చిట్టిమిల్ల గణేశ్‌, సురేందర్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

ఘట్‌కేసర్‌ రూరల్‌ : హరిత కొర్రెములగా జిల్లాకే ఆదర్శంగా తమ గ్రామానికి గుర్తింపు తీసుకువస్తానని సర్పంచ్‌ ఓరుగంటి వెంకటేశ్‌ గౌడ్‌ తెలిపారు. సర్పంచ్‌ వెంకటేశ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్యదర్శి కవిత, సభ్యులు పాల్గొన్నారు.

క్రమం తప్పకుండా అమలు చేయాలి

కీసర : ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ, ఎంపీడీవో ఆధ్వర్యంలో హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాల ముగింపు సమావేశాలను ఆయా గ్రామాల స ర్పంచ్‌ల అధ్యక్షతన శనివారం నిర్వహించారు. పది రోజు ల పాటు తీసుకున్న కార్యక్రమాలను ఆయా గ్రామాల సర్పంచ్‌లు క్రమం తప్పకుండా అమలు చేయాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు.

ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యం అభినందనీయం

హరితహారంలో ప్రైవేట్‌ సంస్థలు కూడా భాగ స్వామ్యం కావడం అభినందనీయమని ఎంపీపీ ఇందిరా లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని చీర్యాల్‌ గ్రామంలో కోల్గేట్‌ పాల్‌ మెలివ్‌ ఇండియా లిమిటెడ్‌ స్వామి సన్స్‌ గ్రూఫ్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఆధ్వర్యంలో ఎర్రోల్ల అంజిరెడ్డి గోడౌన్‌లో శనివారం వారితో కలిసి ఎంపీపీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆ కంపెనీ మేనేజర్‌ ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

వెంకటాపూర్‌ అభివృద్ధికి సహకారం

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూలై 10 : వెంకటాపూర్‌ గ్రామాభివృద్ధికి నిరంతర సహకారం అందిస్తానని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించారు. ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నీరుడు గీత, ప్రత్యేకాధికారి పరిమల, సహకార సంఘం డైరెక్టర్‌ రమేశ్‌ యాదవ్‌, కార్యదర్శి ప్రవీణ్‌, పంచాయతీ సభ్యులు హరీశ్‌, జంగయ్య, కృష్ణ, లత పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పల్లెప్రగతితో గ్రామాలు మరింత అభివృద్ధి
పల్లెప్రగతితో గ్రామాలు మరింత అభివృద్ధి
పల్లెప్రగతితో గ్రామాలు మరింత అభివృద్ధి

ట్రెండింగ్‌

Advertisement