e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి ప్రభుత్వ పాఠశాలలకు ‘కాగ్నిజెంట్‌' చేయూత

ప్రభుత్వ పాఠశాలలకు ‘కాగ్నిజెంట్‌’ చేయూత

ప్రభుత్వ పాఠశాలలకు ‘కాగ్నిజెంట్‌' చేయూత

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాకు చెందిన పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులకు కాగ్నిజెంట్‌ ఔట్‌రీచ్‌ నిర్మాణ్‌ సంస్థ 500ట్యాబ్‌లు, 50ల్యాప్‌ టాప్‌లను శనివారం మల్కాజిగిరి జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వీటిని ఉపాధ్యాయులకు విరాళంగా అందజేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతికి చెందిన 500 మంది విద్యార్థులకు, 50 మంది ఉపాధ్యాయులకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ పరికరాల కోసం సుమారు కోటి రూపాయల వరకు కాగ్నిజెంట్‌ సమకూర్చిందన్నారు.

కాగ్నిజెంట్‌ ఔట్‌రీచ్‌, నిర్మాణ్‌వలంటీర్లు విద్యార్థులకు ట్యాబ్‌,ల్యాప్‌టాప్‌ల వినియోగంపై శిక్షణనిచ్చారు. కాగ్నిజెంట్‌ ప్రతినిధి శైలజా జోస్యులా,నిర్మాణ్‌ సంస్థ సీఈఓ మయూర్‌ పట్నాల మాట్లాడుతూ కరోనా వల్ల పిల్లల చదువు ఆగిపోకుండా ఉండేలా కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి, నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ బోర్డు డైరెక్టర్‌ వెంకట్‌ టంకశాల, పాఠశాల హెచ్‌ఎం వీరేశం, జిల్లాకు చెందిన పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రభుత్వ పాఠశాలలకు ‘కాగ్నిజెంట్‌' చేయూత

ట్రెండింగ్‌

Advertisement