మంగళవారం 04 ఆగస్టు 2020
Medchal - Jul 08, 2020 , 00:15:15

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరం

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరం

చెక్కులు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి, చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌

 మేడ్చల్‌ కలెక్టరేట్‌ : సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపల్‌ పరిధిలోని 20వ వార్డుకు చెందిన ఉపేంద్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న ఆమెకు మంగళవారం రూ.42,500వేలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును మంత్రి అందజేశారు. నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నంరాజు సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆపన్నహస్తం..

 కీసర: ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఆపన్నహస్తంలా ఉపయోగపడుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. కీసరకు అనుబంధ గ్రామమైన వన్నీగూడకు చెందిన కిష్టయ్యకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.42,500వేలు, గోధుమకుంటకు చెందిన పెంటమ్మకు రూ.22,500వేలు  అందజేశారు. కార్యక్రమంలో కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, కీసర సర్పంచ్‌ నాయకపు మాధురి వెంకటేశ్‌, గోధుమకుంట సర్పంచ్‌ ఆకిటి మహేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు జలాల్‌పురం సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు చీర సురేశ్‌, పంచాయతీ సభ్యులు బాల్‌రాజ్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. 

చైర్‌పర్సన్‌, అదనపు కలెక్టర్‌ చెక్కుల పంపిణీ..

 మేడ్చల్‌ రూరల్‌ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం మంజూరైంది. మాణిక్యనగర్‌కు చెందిన ప్రసాద్‌ ఇటీవల గుర్తు తెలియని వాహనం ఢీ కొని తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడికి చికిత్స నిమిత్తం రూ.లక్షా 50వేలు ఖర్చు కాగా, సీఎం సహాయ నిధి కోసం టీఆర్‌ఎస్‌ నేత సహాయంతో దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనకు రూ.60వేల ఆర్థిక సాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కు బాధితుడికి మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌, కౌన్సిలర్లు మల్లికార్జున్‌ ముదిరాజ్‌, జైపాల్‌రెడ్డి, బాలరాజు అందజేశారు.


logo