మంగళవారం 20 అక్టోబర్ 2020
Medchal - Sep 29, 2020 , 00:26:54

బంగారు తెలంగాణకు సీఎం కేసీఆర్‌ కృషి

బంగారు తెలంగాణకు సీఎం కేసీఆర్‌ కృషి

శామీర్‌పేట : బంగారు తెలంగాణ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం శామీర్‌పేట మండలంలో జిల్లా పరిషత్‌ నిధులు రూ.84 లక్షలతో చేపట్టిన సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు భూమిపూజ, లాల్‌గడి మలక్‌పేటలో సీసీరోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నాడని తెలిపారు. ప్రజాశ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. త్వరలోనే సాదాబైనామా తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి పర్యటనలో భాగంగా బాబాగూడ ఉపసర్పంచ్‌ భాస్కర్‌రెడ్డి ఉపసర్పంచ్‌లకు ప్రొటోకాల్‌ ఇవ్వాలని శిలాఫలకాలపై పేర్లు పెట్టాలన్నారు. మజీద్‌పూర్‌, యాడారం, అలియాబాద్‌ గ్రామాల్లో సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్‌ శ్యాంసన్‌, సీఈవో దేవసహాయం, జడ్పీటీసీ అనితలాలయ్య, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, ఏఎంసీ చైర్మన్‌ సునీతలక్ష్మీ, డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు జహీరుద్దిన్‌, వైస్‌ ఎంపీపీ సుజాత , సర్పంచ్‌లు మోహన్‌రెడ్డి, సుజాత, కవిత, భాస్కర్‌, గీతామహేందర్‌, వనజశ్రీనివాస్‌రెడ్డి, లతారవీందర్‌, సుకన్య, ఎంపీటీసీలు అశోక్‌రెడ్డి, ఇందిర, మౌనిక, ఎంపీడీవో వాణి, తహసీల్దార్‌ సురేందర్‌, ఎంపీవో సునీత, ఉపసర్పంచ్‌ భాస్కర్‌రెడ్డి, సాయిబాబుగౌడ్‌, గడ్డం రమేశ్‌, రైతుబంధు మండల కన్వీనర్‌ కంటం కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి తాళ్ల జగదీశ్‌గౌడ్‌, యూత్‌ అధ్యక్షుడు బి.నర్సింహా రెడ్డి, బీసీ సెల్‌ అధ్యక్షుడు అల్లం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

logo