మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Medchal - Aug 07, 2020 , 23:24:39

రోడ్డు ప్రమాదాలకు చెక్‌

రోడ్డు ప్రమాదాలకు చెక్‌

ఆరు శాఖల అధ్యయనం..

ప్రమాద స్థలాలు, కారణాల గుర్తింపు

రహదారులపై నివారణ చర్యలు..

శామీర్‌పేట : ఉరుకుల పరుగుల ప్రపంచంలో అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి చిన్న విషయానికి రోడ్డుపైకి రావడం ఫ్యాషన్‌గా మారింది. ఈ తరుణంలో అతివేగం, మద్యం మత్తు, ప్రమాదకరమైన దారుల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ఘట నలు ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో అంగవైకల్యం పొందినవారు కొందరైతే మరికొంత మంది ప్రాణాలనే కోల్పోతున్నారు. టెక్నాలజీ పరంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అద్దం లాంటి రోడ్లు ఉండడంతో అతివేగంతో వెళ్లే వాహనాలతో క్షణ క్షణం భయంగా మారుతున్నది. మితిమీరిన వేగం, రోడ్లపై అవగాహన లేక పోవడం, ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు నిమిషానికి ఒకటి జరుగుతూనే ఉన్నాయి. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు ఉమ్మడి ప్రణాళిక ద్వారా ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు కృషి చేస్తున్నారు. అనునిత్యం రోడ్డు ప్రమాదాలతో రహదారులకు రక్తతర్పణం వదులుతున్న రహదారులపై తాత్కాలిక చర్యలు చేపట్టడంతో పాటు శాశ్వత చర్యలపై రోడ్లు, రహదారులు, ట్రాఫిక్‌ నియంత్రణ అధికారులకు నివేదిక అందజేశారు. సంవత్సరంలో ఒకే స్థలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి పైగా ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని ట్రాఫిక్‌ పోలీసులు బ్లాక్‌ స్పాట్స్‌గా గుర్తించారు. ఒక్క బ్లాక్‌ స్పాట్‌ను సుమారు 500 మీటర్ల వరకు పరిగణిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మొత్తం 14 స్పాట్స్‌ను గుర్తించారు. ప్రమాదాలను తగ్గించే క్రమంలో తాత్కాలిక చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఉమ్మడి అధ్యయనం ...

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాలకు శాశ్వతంగా చెక్‌ పెట్టేందుకు ఆరు శాఖల అధికారులు ఒక్కటయ్యారు. ట్రాఫిక్‌, సివిల్‌ పోలీసులతో పాటు ఎన్‌హెచ్‌ 44, రాజీవ్‌ రహదారి, హెచ్‌ఎండీఏ, ఎలక్ట్రికల్‌ శాఖ అధికారులు అధ్యయనం చేసి ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేశారు. అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని (అల్వాల్‌, శామీర్‌పేట, పేట్‌బషీరాబాద్‌, మేడ్చల్‌) ప్రమాద స్థలాలు, కారణాలను గుర్తించి తాత్కాలిక చర్యలు చేపట్టి, శాశ్వత పరిష్కారానికి రీజనల్‌ అధికారులకు నివేదిక అందజేశారు.

తాత్కాలిక చర్యలు ... 

అల్వాల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్వాల్‌, కొంపల్లి, తూంకుంట మున్సిపాలిటీ, శామీర్‌పేట మండలం, మూడుచింతలపల్లి, మేడ్చల్‌ మండల పరిధిలోని ఎన్‌హెచ్‌ 44 రహదారిలో 23 కిలో మీటర్లు, రాజీవ్‌ రహదారిపై 22 కిలోమీటర్లతో పాటు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల లింకురోడ్లు సుమారు 101 దారుల్లో ప్రమాద స్థలాలు, మూలమలుపుల వద్ద రాంబుల్‌ స్ట్రిప్స్‌, 850 బొలాట్‌ ఏర్పాటు చేశారు. ఆయా మండలాలు, మున్సిపల్‌ ప్రాంతాల్లో ప్రజలకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. సైబరాబాద్‌

బ్లాక్‌స్పాట్స్‌ ఇవే ...

= రాజీవ్‌ రహదారిపై  రాజేందర్‌ దాబా నుంచి

     ఆరెంజ్‌బోల్‌ సర్కిల్‌ వరకు..

= శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ - కట్టమైసమ్మ.

= అలియాబాద్‌ చౌరస్తా - మజీద్‌పూర్‌ చౌరస్తా.

= తుర్కపల్లి - అచ్చాయిపల్లి చౌరసా.్త

= నిస్సా - హకీంపేట బస్టాప్‌.

= సుచిత్ర సర్కిల్‌ - సత్య ఎన్‌క్లేవ్‌. 

= సత్య ఎన్‌క్లేవ్‌ చౌరస్తా - దూలపల్లి సర్కిల్‌.

= దూలపల్లి అశోక - సీఎంఆర్‌ రోడ్డు.

= కొంపల్లి బ్రిడ్జి - జీవీకే ఈఎంఆర్‌ఐ సర్కిల్‌. 

= కొండ్లకోయ - సీఎంఆర్‌ సర్కిల్‌.

= మేడ్చల్‌ చెక్‌పోస్టు - మేడ్చల్‌ పట్టణం.

= మేడ్చల్‌ - ఐటీఐ అత్వెల్లి.

= రేకుల బావి - డబిల్‌పూర్‌ సర్కిల్‌.

శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు ...


= శామీర్‌పేట కట్టమైసమ్మ బ్రిడ్జి కింద అండర్‌పాస్‌ 

     రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలి.

= బిట్స్‌ చౌరస్తా, మజీద్‌పూర్‌, తుర్కపల్లి 

     ప్రధాన చౌరస్తాల వద్ద సిగ్నల్స్‌ లైట్స్‌ ఏర్పాటు.

= రాజీవ్‌ రహదారిపై స్టెప్ట్స్‌(రోడ్డుపై ఎరుపు 

     సూచిక పట్టిలు), క్యాట్వాక్‌ ఏర్పాటు. 

= కొంపల్లి, దూలపల్లి చౌరస్తాల వద్ద సిగ్నల్స్‌

     ఏర్పాటు.

= ఎన్‌హెచ్‌ 44 రహదారిపై కొంపల్లి నుంచి మేడ్చల్‌

     వరకు సర్వీస్‌ రోడ్ల అభివృద్ధి పనులు.

= కండ్లకోయ, సీఎమ్మార్‌ జంక్షన్‌లు అభివృద్ధి

     పరచడం.

= మేడ్చల్‌ చెక్‌పోస్టు నుంచి అత్వెల్లి వరకు

     ప్రయాణికులు నడుచుకుంటూ రోడ్డు 

     దాటేందుకు 5 వంతెనల ఏర్పాటు.

= మేడ్చల్‌ పట్టణంలో (చెక్‌పోస్టు-అత్వెల్లి వరకు)

      సుమారు 3 కిలో మీటర్ల మేర ఎలివేటర్‌ ఫ్లైఓవర్‌ 

     ఏర్పాటు.

అండర్‌పాస్‌ త్వరగా పూర్తి చేయాలి 

రాజీవ్‌ రహదారిపై కట్టమైసమ్మ సర్కిల్‌ అత్యంత ప్రమాదకర స్థలం. అమ్మవారి దర్శ నం, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం వచ్చిన వారు బ్రిడ్జిపై అతివేగంగా వెళ్లే వాహనాలకు బలవుతూనే ఉన్నారు. శామీర్‌పేట మండల కార్యాలయాల సమీపంలో కట్టమైసమ్మ బ్రిడ్జి కింద అండర్‌పాస్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం తాత్కాలిక రోడ్డు ఏర్పా టు చేస్తున్నాం. శాశ్వత రోడ్డును నిర్మిస్తే ప్రయాణికులు, వాహనదారులకు ఉపయోగంగా ఉంటుంది. ప్రమాదాలు తగ్గిపోతాయి.

- ఆర్‌.గోవర్ధన్‌, తహసీల్దార్‌, శామీర్‌పేట.

ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి 

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై ట్రాఫిక్‌ పోలీస్‌ యం త్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. సైబరాబాద్‌ కమిష నరేట్‌ పరిధి లో ప్రజలకు అవగాహన కార్య క్రమాలతో పాటు రోడ్డు ప్రమా దాల స్థలాల గుర్తింపు, తాత్కా లిక శాశ్వత చర్యలపై ప్రణాళిక సిద్ధం చేశాం. ట్రాఫిక్‌ పోలీస్‌, రహదారులు, విద్యుత్‌ శాఖల ద్వారా ప్రణాళిక తయారు చేసి ఆర్వోకు అందజేశాం. అల్వాల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తింపు, ప్రమాదాల స్థలాలపై అవగాహన కల్పిస్తున్నాం. 14 బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించాం. 

- రాజశేఖర్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ అల్వాల్‌


logo