మేడ్చల్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ఆడబిడ్డలకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.