ఆదివారం 01 నవంబర్ 2020
Medchal - Oct 01, 2020 , 06:49:35

మొక్కలతోనే వాతావరణం సమతుల్యత

మొక్కలతోనే వాతావరణం సమతుల్యత

 శామీర్‌పేట : మొక్కలతోనే వాతావరణ సమతుల్యత సాధ్యమని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. మండల పరిధిలోని పొన్నాల్‌ గ్రామంలో బుధవారం 6వ విడుత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. పంచాయతీ ద్వారా నాటుతున్న మొక్కలతో పాటు ప్రతి ఇంట్లో మొక్కలు నాటే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ సుకన్యసత్యనారాయణ, ఎంపీటీసీ మౌనిక శివవీరప్రసాద్‌, ఉపసర్పంచ్‌ గడ్డం రమేశ్‌, కలికోట ప్రభాకర్‌, శివ, శివశంకర్‌ పాల్గొన్నారు.

 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్‌ 

మేడ్చల్‌ కలెక్టరేట్‌  :  మహాత్మ జ్యోతిరావు ఫూలే  గురుకుల పాఠశాల ఇంటర్‌ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష కేంద్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌ సందర్శించారు. నాగారం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షలను అదనపు కలెక్టర్‌ పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో 9 కేంద్రాల్లో  ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.  ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రారెడ్డి, అధికారులు తదితరులు పాన్నారు.