శుక్రవారం 23 అక్టోబర్ 2020
Medchal - Aug 20, 2020 , 00:42:25

సీఎంఆర్‌కు ‘ఆర్య’ ర్యాంకు

సీఎంఆర్‌కు ‘ఆర్య’ ర్యాంకు

మేడ్చల్‌ రూరల్‌ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్‌ సెట్‌ (కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ)కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ) ఆధ్వర్యం లో ప్రకటించిన ఏఆర్‌ఐఐఏ(అటల్‌ ర్యాంకింగ్‌ ఆన్‌ ఇనిస్టిట్యూషన్స్‌ ఆన్‌ ఇన్నోవేషన్‌ అచీవ్‌మెంట్స్‌)-2020 ర్యాంకుల్లో స్థానం దక్కింది.  ఢిల్లీలో వర్చువల్‌ పద్ధతిలో మంగళవారం అవార్డుల ప్రకటన కార్యక్రమం జరిగింది. ఇందులో సీఎంఆర్‌ సెట్‌కు జాతీయ స్థాయిలో ఐదో స్థానం లభించింది. రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. ‘ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌' సంబంధించిన సూచికలపై దేశంలోని అన్ని ప్రధాన ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఏఆర్‌ఐఐఏకు పోటీ పడ్డాయి.  ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంఆర్‌ సెట్‌ కార్యదర్శి చామకూర గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ అటల్‌ ర్యాంకింగ్‌ కోసం దేశ వ్యాప్తంగా 680 కళాశాలలు పోటీపడితే 5వ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వీఏ నారాయణ, డైరెక్టర్‌ జంగారెడ్డి, ఆర్‌అండ్‌డీ హెడ్‌ డాక్టర్‌ మెరుగు సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo