ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి దరఖాస్తుల స్వీకరణ

మేడ్చల్, : ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. హకీంపేట్‌లోని స్పోర్ట్ స్కూల్లో మార్చి 5 నుంచి 24 వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వెబ్సైట్ www.joinindianarmy.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆర్మీ అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుదారుల పరిశీలన అనంతరం అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 19 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. రిక్రూట్మెంట్లో పోస్టులు సోల్జర్(టెక్నికల్) సోల్జర్ టెక్నికల్ (ఏవియేషన్, అమ్యునేషన్ ఎగ్జామినర్) సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు వెబ్‌సైట్‌ను పరిశీలించి వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
85 వేల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం..
మార్చి 5 నుంచి 24 వరకు జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సుమారు 85 వేల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉంటుందని సికింద్రాబాద్ ఆర్మీ అధికారులు అంచనా వేస్తున్నారు. ర్యాలీకి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మేడ్చల్ జిల్లా అధికారులు సహకారం అందించనున్నారు. ఆర్మీ అధికారుల సూచనల మేరకు ర్యాలీకి వారం రోజుల ముందు నుంచే సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనల మేరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. వివిధ విభాగాల అధికారుల సమన్వయంతో పనిచేసి ర్యాలీని విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- పెట్రోల్ మంట: భారత విజ్ఞప్తిని పట్టించుకోని సౌదీ అరేబియా
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్‌కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు