మంగళవారం 20 అక్టోబర్ 2020
Medchal - Sep 26, 2020 , 00:51:48

శ్రీరామ్‌నగర్‌ కాలనీ భూములపై ఆర్మీ జోక్యం తగదు

 శ్రీరామ్‌నగర్‌ కాలనీ భూములపై ఆర్మీ జోక్యం తగదు

 ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తా

  ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ 

 కుత్బుల్లాపూర్‌ : డివిజన్‌  శ్రీరామ్‌నగర్‌ కాలనీలోని 101, 105 సర్వే నంబర్లలో ప్రైవేట్‌కు సంబంధించిన భూములలో ఆర్మీశాఖ జోక్యం చేసుకుంటూ అక్కడి ప్రజలకు నోటీసులు జారీచేస్తూ భయబ్రాంతులకు గురి చేయడం సరికాదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. ఇటీవల ఆర్మీశాఖ శ్రీరామ్‌నగర్‌ వాసులకు ఆర్మీస్థలాలు అని నోటీసులు జారీ చేయడంపై సమస్యను శుక్రవారం చింతల్‌ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై స్పందించిన ఆయన స్థల వివాదంపై ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు భరోసాను ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు కేఎం గౌరీశ్‌, కాలనీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు అరుణ, విజయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 

 ఓటర్‌ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభం..  

జీడిమెట్ల : కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ సుభాష్‌నగర్‌ డివిజన్‌ పరిధి అపురూపకాలనీలో కార్పొరేటర్‌ దేవగారి శాంతిశ్రీ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటర్‌ నమోదు కేంద్రాన్ని శుక్రవారం కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు దేవగారి రాజేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు మన్నెరాజు, రంగారావు, వై.సంతోష్‌రెడ్డి, పద్మజారెడ్డి, వార్డు కమిటీ సభ్యులు అడపా శేషు, కార్యకర్తలు పాల్గొన్నారు. logo