ఆదివారం 12 జూలై 2020
Medchal - Jun 04, 2020 , 02:21:14

డ్రోన్‌ల సహాయంతో దోమల మందుల పిచికారీ

డ్రోన్‌ల సహాయంతో దోమల మందుల పిచికారీ

సరూర్‌నగర్‌ మినీ ట్యాంక్‌బండ్‌ చెరువులో కొనసాగుతున్న పనులు 

ఎల్బీనగర్‌: ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో దోమలపై సమరం  యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. ఓ వైపు నివాసాల్లో ఫాగింగ్‌, యాంటీ లార్వా ఆపరేషన్‌ టీం లతో మందులను పిచికారీ చేస్తుండగా అధికారులు డ్రోన్‌ యంత్రాల ద్వారా చెరువుల్లోనూ యాంటీ లార్వా మందును పిచికారీ చేయిస్తున్నారు. దోమలను ప్రాథమిక దశలోనే పూర్తిగా తుదముట్టించేందుకు శ్రీకారం చుడుతున్నారు.   ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో మూసీ పరివాహక ప్రాంతం ఉన్నది. 

   ఈ నేపథ్యంలో మూసీ నదిలోనూ ప్రత్యేకంగా దోమల నివారణ మందులను పిచికారీ చేయిస్తున్నారు. ప్రధానంగా ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని ప్రధాన చెరువులపై అధికారులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 

   ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సైతం దోమలపై యుద్ధం ప్రకటించి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. దీంతో ఎంటమాలజీ విభాగం  దోమల నివారణ చర్యలు చేపట్టింది. నాగోలు, బండ్లగూడ చెరువుల్లో డ్రోన్‌ యంత్రాలతో దోమల నివారణ మందులను చల్లించడంతో పాటుగా తాజాగా సరూర్‌నగర్‌ చెరువు ప్రాంతంలో డ్రోన్‌తో దోమల నివారణకు మందులను చల్లుతున్నారు. 

  సరూర్‌నగర్‌ చెరువులో గత ఏడాది గుర్రపు డెక్క ఆకు, దోమల తీవ్రతతో ప్రజలు నిత్యం నరకం అనుభవించారు. ఈ ఏడాది ఆ పరిస్థితి  పునరావృతం కాకుం డా అధికారులు  చర్యలు చేపట్టారు.


logo