శనివారం 24 అక్టోబర్ 2020
Medchal - Sep 30, 2020 , 06:58:51

అంగన్‌వాడీ సెంటర్‌లను పెంచాలి .. పుప్పాల భాస్కర్

అంగన్‌వాడీ సెంటర్‌లను పెంచాలి .. పుప్పాల భాస్కర్

 దుండిగల్‌ : గాజులరామారం సర్కిల్‌ పరిధిలో మరిన్ని అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూరారం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సుచిత్రలోని సీపీడీవో కార్యాలయంలో పీవో హెప్సిబను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ,శిశు సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి మాతృమూర్తికి చేరాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. అందులో భాగంగా కుత్బుల్లాపూర్‌,గాజులరామారం సర్కిళ్ల పరిధిలో మరిన్ని సెంటర్‌లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.కార్యక్రమంలో పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.


logo