టీఆర్ఎస్లో చేరికలు..

బోడుప్పల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు మంత్రి మల్లారెడ్డి అన్నారు. మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బోడుప్పల్ మాజీ వార్డు సభ్యులు తోటకూర శ్రీశైలం యాదవ్ శుక్రవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని పార్టీ లో చేరుతున్నట్లు శ్రీశైలం యాదవ్ స్పష్టం చేశారు. కార్యక్రమం లో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్,నాయకులు రమేశ్, యాదగిరి పాల్గొన్నారు.
మంత్రి మల్లారెడ్డికి వినతి...
బోడుప్పల్ : బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని 18వ డివిజన్ కార్పొరేటర్ పులకండ్ల హేమలత కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని కోరారు. శుక్రవారం మంత్రి మల్లారెడ్డిని ఆయన నివాసంలో కలిసి సమస్యలు నివేదించారు. కార్యక్రమంలో పులకండ్ల జంగారెడ్డి , డివిజన్ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్,రవికాంత్‌రెడ్డి, ప్రభాకర్, రమేశ్‌కుమార్ పాల్గొన్నారు.
కార్పొరేటర్ రాసాల వెంకటేశ్ ఆధ్వర్యంలో..
బోడుప్పల్ పట్టణ 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేశ్ యాదవ్ ఆధ్యర్యంలో మంత్రిని మల్లారెడ్డిని కలిశారు. డివిజన్ పరిధిలోని రా చెరువు అభివృద్ధికి ప్రత్యేకనిధులు మంజూ రు చేయాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు బద్దుల సుగుణ సత్యనారాయణ యాదవ్, క్రిష్ణారెడ్డి,మల్లేశ్, సుభాష్, డివిజన్ నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- హంస వాహనాధీశుడైన శ్రీశైలేశుడు..
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
- వందో పుట్టిన రోజున.. కరోనా టీకా వేయించుకున్న బామ్మ
- రైతులను ఆదర్శంగా తీర్చుదిద్దేందుకు ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల ఈశ్వర్
- ఈ నెల 15 తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
- వారంలో రూ.1.97లక్షల కోట్లు నష్టపోయిన ఎలాన్ మస్క్
- చిన్న సినిమాలతో దండయాత్ర చేస్తున్న అల్లు అరవింద్