ఆదివారం 17 జనవరి 2021
Medchal - Aug 25, 2020 , 00:10:46

రోడ్లపైకి ఆవులను వదిలితే చర్యలు

రోడ్లపైకి ఆవులను వదిలితే చర్యలు

మేయర్‌ మహేందర్‌గౌడ్‌

బండ్లగూడ,ఆగస్టు 24: రోడ్లపైకి ఆవులను వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్‌ మహేందర్‌గౌడ్‌ హెచ్చరించారు. బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌ పరిధి

లోని రోడ్ల పైకి వచ్చిన ఆవులను కార్పొరేషన్‌ సిబ్బంది ప్రహరీ లోపల బంధించారు. విషయం తెలుసుకున్న ఆవుల యజమానులు  వదిలి వేయాలని మేయర్‌ మహేందర్‌గౌడ్‌, అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారితో మేయర్‌ మాట్లాడుతూ రోడ్లపై ఆవులను వదిలేయడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.  ఇకపై ఆవులను రోడ్లపైకి వదిలితే జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్‌ మనోహర్‌, సురేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.