శుక్రవారం 23 అక్టోబర్ 2020
Medchal - Sep 30, 2020 , 06:52:11

జగద్గిరిగుట్టలో బస్‌డిపోను ఏర్పాటు చేయాలి.. కార్పొరేటర్‌ కొలుకుల జగన్

జగద్గిరిగుట్టలో బస్‌డిపోను ఏర్పాటు చేయాలి.. కార్పొరేటర్‌ కొలుకుల జగన్

 గాజులరామారం : గాజులరామారం సర్కిల్‌ పరిధిలో ని జగద్గిరిగుట్ట హెచ్‌ఎంటీ ఖాళీ స్థలంలో బస్‌డిపోను ఏర్పాటు చేయాలని స్థానిక కార్పొరేటర్‌ కొలుకుల జగన్‌ మంగళవారం ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశా రు. జగద్గిరిగుట్టలో బస్‌డిపో ఏర్పాటు కోసం హెచ్‌ఎంటీ అధికారులతో చర్చించి స్థలం కేటాయించేలా చూడాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి అధికారులతో చర్చించి డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు జగన్‌ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరి, విజయ్‌శేఖర్‌గౌడ్‌, మంత్రి సత్యనారాయణ, సుభాష్‌నగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


logo