ఆదివారం 29 నవంబర్ 2020
Medchal - Aug 19, 2020 , 23:54:10

భవనం పై నుంచి పడి బాలుడు, కార్మికుడి మృతి

భవనం పై నుంచి పడి బాలుడు, కార్మికుడి మృతి

అల్వాల్‌/మెహిదీపట్నం: నగరంలో వేర్వేరు చోట్ల భవనాలపై నుంచి జారి పడి సెంట్రింగ్‌ కార్మికుడు, బాలుడు మృతి చెందిన సంఘటన హుమాయూ న్‌నగర్‌,అల్వాల్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోటు చేసు కున్నాయి. మెహిదీపట్నం విజయ్‌నగర్‌ కాలనీలో ఓ వ్యక్తి ఆరు అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. ఈ భవనంలో బుధవారం రేతిబౌలి వడ్డెర బస్తీకి చెందిన సంగమేశ్‌(35) సెంట్రింగ్‌ పనులు చేయడానికి వచ్చా డు. మధ్యాహ్నం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మూడో అంతస్తుపై  నుంచి జారి కింద పడి అక్కడి కక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం ఎస్‌ఐ జానయ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అల్వాల్‌ పరిధిలోని హస్మం త్‌పేట్‌ అంజయ్యనగర్‌కు చెందిన సదానంద్‌ తన కుమారుడు  పరుశురాం (13)ను అదే ప్రాంతంలో ఉంటున్న తన సోదరి ఇంటి వద్ద వదిలి తన స్వగ్రామా నికి వెళ్లాడు. బుధవారం పరుశురాం భవనం రెండో అంతస్తులో ఆడుకుంటూ కిందపడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు దవాఖానకు తరలించ గా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మా ర్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.