శనివారం 27 ఫిబ్రవరి 2021
Medchal - Jan 28, 2021 , 06:00:40

ప్రాథమ్యాలు గుర్తెరిగి పనిచేయండి

ప్రాథమ్యాలు గుర్తెరిగి పనిచేయండి

మేడ్చల్ : వ్యవసాయంలో పంటమార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేలా కృషి చేయాలని మేడ్చల్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతా మహంతి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. తరచూ పంట మార్పిడి చేసేలా రైతులను చైతన్యపర్చాలని సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం వ్యవసాయాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని, దీనికనుగుణంగా రైతులకు సేవలందిం చాలన్నారు. అన్ని మండలాల్లో వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటమార్పిడి, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. గతంతో పోల్చితే ప్రస్తుతం వ్యవసాయశాఖ అధికారుల బాధ్యత ఎంతో పెరిగిందని గుర్తుచేశారు. జిల్లావ్యాప్తంగా పూర్తయిన రైతు వేదికలను వినియోగంలోకి తేవాలని, వేదికలకు కావాల్సిన ఫర్నిచర్‌తోపాటు అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. జిల్లాలో సాగు వివరాల నివేదికను పదిరోజుల్లో సమర్పించాలని, రైతుబంధు, రైతుబీమా పథకాలను అర్హులందరికీ వర్తింపజేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి మేరి రేఖ, అధికారులు, ఏఈవోలు పాల్గొన్నారు.


VIDEOS

logo