ఆదివారం 07 మార్చి 2021
Medchal - Jan 28, 2021 , 04:55:16

ప్రగతి పథంలో ‘మేడ్చల్‌' పురపాలికలు

ప్రగతి పథంలో ‘మేడ్చల్‌' పురపాలికలు

  • పాలకవర్గాలు  ఏర్పడి ఏడాది పూర్తి 
  • రూ. 250 కోట్లతో అభివృద్ధి  పనులు ..

మేడ్చల్‌, జనవరి27(నమస్తే తెలంగాణ): మేడ్చల్‌ జిల్లాలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా నాలుగు కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, పాలకవర్గాలు ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ కాలంలో అనేక అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పురపాలికల దశ పూర్తిగా మారిపోయింది. రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు, పార్కులు, హరితహారం, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలు చేపట్టారు. ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు కల్పించారు. 

అభివృద్ధి పనుల కోసం ఎన్ని నిధులైనా వెచ్చిస్తుండటంతో పురపాలికలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. 

పుష్కలంగా నిధులు..

మేడ్చల్‌ నియోజకవర్గంలో మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు ఉండగా, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఒక కార్పొరేషన్‌ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏడాదిలో రూ. 250 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. అంతేకాకుండా కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో  కౌన్సిల్‌  సమావేశాలు నిర్వహించి అభివృద్ధికి పాలకవర్గాలు చర్యలు తీసుకుంటున్నది. ప్రజల సమస్యలను గుర్తించి, వారికి అవసరమయ్యే  వసతుల కల్పనకు నిధుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలను సమర్పిస్తున్నది.

VIDEOS

logo