పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

శామీర్‌పేట, జనవరి 27 : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలంలోని లాల్‌గడి మలక్‌పేట, మురహార్పల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులు లక్ష్మాపూర్కి రూ.24 వేలు, శ్రీనివాస్‌రెడ్డికి రూ.65 వేల చెక్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చీదు శ్రీనివాస్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, నర్సింగ్‌రావు, యూత్ అధ్యక్షుడు బి.నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్‌లో..
ఘట్కేసర్ రూరల్, జనవరి 27 : సీఎం సహాయనిధి పేద ప్రజల ఆశాదీపమని కొర్రెముల సర్పంచ్ ఓరుగుంటి వెంకటేశ్ గౌడ్ అన్నారు. మండలపరిధిలోని కొర్రెముల గ్రామానికి చెందిన బి.జంగయ్యకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.47 వేల చెక్కును బుధవారం సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ పంచాయతీ కార్యాలయం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కందుల రాజు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రూ.12 వేలు తగ్గిన బంగారం: పెట్టుబడికి ఈ టైం సరైందేనా?!
- బెంగాల్ పోలింగ్‌పై పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు..!
- శ్రీవారి సేవలో ఏ1 ఎక్స్‌ప్రెస్ టీమ్
- నేను హర్ట్ అయ్యా.. రాహుల్‌కు జ్ఞాపకశక్తి తగ్గిందా ?
- కరోనా టీకా తీసుకున్న పరేష్ రావల్
- భార్యకు టీఎంసీ టికెట్.. హౌరా ఎస్పీని తొలగించిన ఈసీఐ
- 'అలాంటి సిత్రాలు' టీజర్ విడుదల
- కాగజ్‌నగర్‌లో స్కూటీని ఢీకొట్టిన ఆటో.. వీడియో
- ‘పల్లా’కు మద్దతుగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ప్రచారం
- బీబీసీ ఇండియా స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్‌గా హంపి