స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి

మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 27 : స్వచ్ఛ మున్సిపాలిటీగా నాగారంను తీర్చిదిద్దాలని మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు ఎస్వీ నగర్లో బుధవారం స్వచ్ఛ్ సర్వేక్షణ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ తడి,పొడి చెత్తను వేరు చేసి చెత్త డబ్బాల్లో వేయాలని ప్రజలను సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాణి రెడ్డి, కౌన్సిలర్లు కౌకుట్ల మమతాకృష్ణారెడ్డి, అన్నంరాజు లావణ్య, కౌకుట్ల అనంతరెడ్డి, కొమిరెళ్లి అనితా, నాయకులు శ్రీధర్, అన్నంరాజు సురేశ్, కౌకుట్ల కృష్ణారెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్లో..
ఘట్కేసర్, జనవరి 27 : ఘట్కేసర్ మున్సిపాలిటీని రాబోయే నాలుగు ఏండ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచి ఆదర్శ వంతంగా తీర్చిదిద్దుతామని ఘట్కేసర్ చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్యయాదవ్ అన్నారు. మునిపాలిటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా బుధవారం ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. దాదాపు రూ.11 కోట్లతో మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి జరిగిందన్నారు. పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పడిన ఘట్కేసర్లోని 18 వార్డుల్లో ప్రజలకు కావల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి సంవత్సరం అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.
మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట..
పోచారం మున్సిపాలిటీలో గడిచిన ఏడాది కాలంలో ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసినట్లు చైర్మన్ బి.కొండల్ రెడ్డి తెలిపారు. బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా బుధవారం పాలకవర్గం సభ్యులు, అధికారులతో కలిసి కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కొండల్‌రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు రూ.18 కోట్ల, 12 లక్షలతో మున్సిపాలిటీలోని 18 వార్డుల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, హరితహారం, తడి,పోడి చెత్త, ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. వివరించారు.
తాజావార్తలు
- తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదు : మంత్రి కేటీఆర్
- రాముడిగా ప్రభాస్.. లక్ష్మణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో..!
- కొత్త రేడార్‌ను అభివృద్ధి చేసిన ఇస్రో
- కొవిడ్ టీకా తీసుకున్న ఎల్కే అద్వానీ
- వరంగల్ జైలుకు బిట్టు శ్రీను
- అత్తారింట్లో భార్యను ఎవరు కొట్టినా భర్తదే బాధ్యత: సుప్రీంకోర్టు
- ఆటో ఇండస్ట్రీ ‘రైట్‌సైజింగ్’: ఆదా కోసం ఉద్యోగాలపై వేటు!
- డిజిటల్ బడ్జెట్ : అందరికీ ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్
- చిరు సాంగ్‌కు చిందేసిన మోనాల్.. వీడియో వైరల్
- కొవిడ్ టీకా తీసుకున్న డీఎంకే అధ్యక్షుడు