శనివారం 06 మార్చి 2021
Medchal - Jan 27, 2021 , 04:45:20

అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి

చర్లపల్లి, జనవరి 26 : అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చర్లపల్లి డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. మంగళవారం డివిజన్‌ పరిధిలోని పెద్ద చర్లపల్లిలోని తిరుమల్‌ ఫంక్షన్‌ హాల్‌లో శ్రీ విఘ్నేశ్వర మున్నూరు కాపు సంఘం ఒకటో వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఆమె మాట్లాడుతూ.. మున్నూరు కాపు కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నూతనంగా రూపొందించిన క్యాలెండర్‌ను ఆమె ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు మామిళ్ల శ్రీనివాస్‌, వేల్పుల శ్రీనివాస్‌, కర్ర వెంకటేశ్వర్‌, కొడిమ్యాల శ్రీనివాస్‌, సంఘం ప్రతినిధులు కూన మహేశ్‌, కందుల శ్రీనివాస్‌, సోమేశ్‌, సోమయ్య, పుప్పాల శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo