సాయం చేసే చేతులే మిన్న

అల్వాల్, జనవరి 26: ప్రార్థించే పెదాలకన్న సాయం చేసే చేతులే మిన్న అనే నానుడికి పర్యాయ పదంగా మైనంపల్లి సోషల్ సర్విస్ ఆర్గనైజేషన్ నిలుస్తుందని ప్రముఖ నటి భాగ్యశ్రీ అన్నారు. మైనంపల్లి సోషల్ సర్విస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అల్వాల్ లోతుకుంటలో నిర్వహించిన సామాజిక సేవ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి నటి రేణుదేశాయ్‌తో పాటు ఎమ్మెల్సీ దయానంద్‌తో కలిసి పాల్గొన్నారు. నటీమణులు మాట్లాడుతూ మైనంపల్లి రోహిత్ చైర్మన్‌గా పనిచేస్తున్న మైనంపల్లి సోషల్ సర్విస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం గొప్పవిషయమని అన్నారు. ఇండియన్ ప్రిన్స్ ఆఫ్ అమెరికాతో పాటు యునెస్కో ప్రశంసలు అందుకోవడం గర్వంచదగ్గ విషయమని పేర్కొన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో రోగులకు ఉచిత సేవలను అందించేందుకు అంబులెన్స్ సేవలను నటీమణులు భాగ్యశ్రీ, రేణుదేశాయ్, మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలతో పాటు పలువురు అందులకు, వితంతువులకు ఆయన చెక్కులను అందజేసారు. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ఆర్గనైజేషన్ 1997 నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ యాక్టర్లు బిత్తిరి సత్తి, రవి, గీతా భగత్‌లతో పాటు టీఆర్ఎస్ నాయకులు ఉపేందర్, సురేశ్‌రెడ్డి, మంత్రి సత్యనారాయణ, నరేంద్రరాజు, సబిత, రేణుకుమార్, జయలక్ష్మి, జగదీశ్ మోహన్‌రెడ్డి, స్టార్ రాజు, గాయిత్రి, బబిత, ప్రేంకుమార్, ఆనంద్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నేడు తాకట్టు ఆస్తులు వేలం: ఎస్బీఐ
- రైతు ఆదాయం రెట్టింపు ఎలా?
- చమురు ధరల పెంపు అహేతుకం
- మళ్లీ పుంజుకున్న బిట్‌కాయిన్
- నీతిమాలిన నిందలు
- హిందుత్వానికి అసలైన ప్రతీక
- కోటక్ చేతికి ఆర్మీ జవాన్ల వేతన ఖాతాలు!
- అదనపు భద్రత+ ఏబీఎస్‌తో విపణిలోకి బజాజ్ ప్లాటినా-110
- మిల్క్ టూ వంటనూనెల ధరలు ‘భగభగ’!..
- ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్‌రావుకు చిన్నచూపు