గురువారం 25 ఫిబ్రవరి 2021
Medchal - Jan 26, 2021 , 03:53:24

రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌

రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌

గాజులరామారం, జనవరి 25 : రానున్న రోజుల్లో రోజు విడిచి రోజు నీరు అందించడమే తమ లక్ష్యమని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌ అన్నారు. సోమవారం జగద్గిరిగుట్ట డివిజన్‌ పరిధిలోని బేకరిగడ్డలో తాగునీటి సరఫరా కులాయిని ఆయన పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వారానికి రెండు రోజులు తాగునీరు అందిస్తామన్నారు.తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ప్రవేశపెట్టి ఇంటింటికి తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.  జగద్గిరిగుట్ట డివిజన్‌ కార్పొరేటర్‌ కొలుకుల జగన్‌, జలమండలి జనరల్‌ మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి, డీజీఎం అప్పలనాయుడు, మేనేజర్‌ శివ, గాజులరామారం డివిజన్‌ అధ్యక్షుడు విజయరామిరెడ్డి, వార్డు కమిటీ సభ్యులు సింగారం మల్లేశ్‌, నాయకులు రావుల పృథ్వీ, శ్రీనివాస్‌యాదవ్‌, దిలీప్‌, తిరుపతియాదవ్‌, కాలనీ వాసులు సతీశ్‌, మౌలానా, ఖలీమ్‌ పాషా, అఫ్జల్‌ పాల్గొన్నారు. 


VIDEOS

logo