గురువారం 25 ఫిబ్రవరి 2021
Medchal - Jan 26, 2021 , 03:53:19

బాలల పరిరక్షణకు చర్యలు

బాలల పరిరక్షణకు చర్యలు

  • నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి

 మేడ్చల్‌ కలెక్టరేట్‌, జనవరి 25 : బాలల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం చైర్మన్‌ అధ్యక్షతన బాలల పరిరక్షణ సంస్థ కమిటీ , సఖీ కమిటీలను 14 మంది సభ్యులతో ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్‌గా మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రారెడ్డి, కన్వీనర్లుగా అంగన్‌వాడీ కార్యకర్తలు, కమిటీ మెంబర్లుగా మున్సిపల్‌ కమిషనర్‌, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధికారులను నియమించారు. అనంతరం కరపత్రాలను అవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వాణిరెడ్డి, అంగన్‌వాడీ సూపర్‌ వైజర్‌ అంజమ్మ, సఖీ కో-ఆర్డ్డీనేటర్‌ రమాదేవి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

VIDEOS

logo