గురువారం 25 ఫిబ్రవరి 2021
Medchal - Jan 26, 2021 , 03:53:13

మౌలిక వసతుల కల్పనకు కృషి

మౌలిక వసతుల కల్పనకు కృషి

  • కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
  • పోచారం మున్సిపాలిటీలో రూ.79.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఘట్‌కేసర్‌, జనవరి 25 : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు  ప్రభుత్వం కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీలో 79.50 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ సహకారంతో మున్సిపాలిటీల అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని,  అభివృద్ధిపై  ఎప్పటికప్పడు సమీక్షలు నిర్వహిస్తున్నారని వివరించారు. మున్సిపాలిటీల్లో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తూ, మంత్రి కేటీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో అనేక సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చెప్పారు. 60 ఏండ్లలో జరుగని అభివృద్ధి ఆరేండ్లలో   చేసి చూపించారని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నదని  పేర్కొన్నారు. 

 అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పోచారం మున్సిపాలిటీ 3,5,13,16వ వార్డులలో 79.50 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 3వ వార్డులో రూ.15 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీహాలు, 5వ వార్డులో మున్సిపాలిటీ ఖాళీ స్థలానికి రూ.20 లక్షలతో ప్రహరీ, 13వ వార్డులో వైకుంఠధామానికి రూ.30 లక్షలతో అభివృద్ధి పనులు, 16వ వార్డులో రూ.14.50 లక్షలతో అంతర్గత భూగర్భ మురుగు కాలువ నిర్మాణం, సీసీరోడ్డు పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్‌ బి.కొండల్‌ రెడ్డి, కమిషనర్‌ సురేశ్‌, వైస్‌ చైర్మన్‌ రెడ్యానాయక్‌ , కౌన్సిలర్లు రాజశేఖర్‌, సాయిరెడ్డి, వెంకటేశ్‌ గౌడ్‌, బి.హరిప్రసాద్‌రావు, బాల్‌రెడ్డి, శ్రీలత, రవీందర్‌, పోచమ్మ, మమత, కో ఆప్షన్‌ సభ్యులు, మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మందడి సురేందర్‌రెడ్డి,  నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు. 


VIDEOS

logo