గురువారం 25 ఫిబ్రవరి 2021
Medchal - Jan 26, 2021 , 03:47:22

రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం

రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం

దుండిగల్‌,జనవరి25: దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధి బౌరంపేటలోని శ్రీభ్రమరాంభికా మల్లికార్జున స్వామి, రేణుకా ఎల్లమ్మ జాతర సోమవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ కల్యాణవేడుకల్లో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి పూలబొకే అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ నర్సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అమరం గోపాల్‌రెడ్డి, బౌరంపేట పీఏసీఎస్‌ చైర్మన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ మిద్దెల బాల్‌రెడ్డి, మాజీ చైర్మన్‌ రవి యాదవ్‌, మేడ్చల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పోలీస్‌ గోవిందరెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు బెంబడిబుచ్చిరెడ్డి, మురళీయాదవ్‌, ధర్మారెడ్డి, ఆలయకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

VIDEOS

logo