లాఠీ..సీటీతో చెత్తపై సమరం!

కుత్బుల్లాపూర్,జనవరి25: విచ్చలవిడిగా చెత్తను బయట వేయకుండా ఇంట్లోనే వేరుగా చేసి నేరుగా మన ఇంటి ముందుకు వచ్చే స్వచ్ఛ ఆటోలో చెత్తను వేద్దాం.. అంటూ కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా చెత్తపై సమరం చేసేందుకు విజిలెండ్ వర్కర్‌ను ఏర్పాటు చేసి లాఠీ.. సీటి(చేతిలో కర్ర.. నోటితో సీటి)తో పాయింట్ల వద్ద పరిశుభ్రం చేసి రంగురంగుల ముగ్గులతో ఆకర్శణీయంగా తీర్చిదిద్దుతూ ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
11 పాయింట్ల వద్ద పకడ్బందీ చర్యలు..
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని అత్యధికంగా చెత్త వేసే 11 పాయింట్లుగా గుర్తించారు. నిత్యం ఈ పాయింట్ల వద్ద టన్నుల కొద్ది చెత్తను రాత్రి నుంచి ఉదయం వరకు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతుంది. కారణం రాత్రి నుంచి ఉదయం వరకు బాధ్యత తెలవని కొంతమంది చేసే ఈ చర్య వలన చెత్త రోడ్లపై విచ్చలవిడిగా పడి దర్శనమిస్తున్నది. ఈ క్రమంలో సంబంధిత శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. 11 పాయింట్ల వద్ద 11 మంది పారిశుధ్య కార్మికులకు టేబుల్ వేసి కుర్చీ వేసి చెత్త వేయకుండా.. చెత్త వేయడానికి వచ్చే వారికి అవగాహన కల్పించేందుకు విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇంటి యజమానిదే బాధ్యత..
ఇంటి యజమాని కిరాయి అద్దెలో చెత్త వేసేందుకు ఖర్చులను అదనంగా వసూలు చేసి.. నేరుగా స్వచ్ఛ ఆటోలో చెత్త వేసేలా యజమాని బాధ్యత తీసుకోవాలని శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన అపార్ట్మెంట్లు, ఇతర విల్లాస్‌లతో పాటు కాలనీల అసోసియేషన్లతో అవగాహనతో ముందుకెళ్తున్నారు. పదేపదే చెత్తను బహిర్గతంగా వేస్తున్నారని గుర్తిస్తే అలాంటి వారు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు చెత్తను బయట వేసిన వ్యక్తులను గుర్తు పట్టి.. వారితోనే తిరిగి సేకరించేలా విజిలెండ్ వర్కర్ తగు చర్యలు తీసుకుంటారు.
చెత్తబిన్లకు చరమగీతం..
గతంలో చెత్తను వేసేందుకు ప్రధాన కూడళ్లు.. ఇతర చౌరస్తాలతో పాటు జన సమూహాలు లేని ప్రాంతం వద్ద చెత్తను వేసేందుకు అక్కడ చెత్తకుండీలు(బిన్) ఉండేవి. ఈ క్రమంలో ప్రస్తుతం అధికారులు చేపడుతున్న డైవ్‌లో భాగంగా కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏ ఒక్క ప్రాంతంలో బిన్లు లేకుండా శాశ్వతంగా తొలగించారు. వీటి స్థానాల్లో ఇంట్లోనే చెత్త డబ్బాల్లో వేసుకొని వాటిని స్వచ్ఛ ఆటోల ద్వారా తీసుకెళ్లేలా తగు చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు ప్రస్తుతం చేపడుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ -2021 ప్రచారంలో భాగంగా డప్పు.. సప్పుడుతో ఇంటింటా తిరిగి అవగాహన కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు.
బాధ్యతతో ముందుకెళ్దాం
ప్రతి ఒక్కలం బాధ్యతతో సమాజంలో మెలుగుదాం. ఇంటిని ఏ విధంగానైతే శుభ్రంగా చూసుకుంటారో.. సమాజాన్ని కూడా అదేవిధంగా శుభ్రంగా చూసుకునే నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. చెత్తను విచ్చలవిడిగా వేయకుండా జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించండి. త్వరలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో క్లీన్ హైద్రాబాద్.. క్లీన్ టాయిలెట్లను ఏర్పాటు చేసి అందులో టర్కి టవల్, హాండ్ వాష్‌తో పాటు సబ్బులు, ఇతర సదుపాయాలతో సులభ్‌కాంప్లెక్స్ వలె నిరంతరం శుభ్రంగా ఉండేలా ఒక నిర్వాహకుడిని ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు సర్కిల్ పరిధిలో మరో 10 స్వచ్ఛ ఆటోలు త్వరలోనే రానున్నాయి. - డా.భానుచందర్, ఏఎంహెచ్ఓ, కుత్బుల్లాపూర్ సర్కిల్
తాజావార్తలు
- ప్రజలను దోచుకోవడంపై డీఎంకే, కాంగ్రెస్ నేతల మేథోమథనం : మోదీ
- రికార్డు స్థాయిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు : ఎమ్మెల్సీ కవిత
- పటాకుల తయారీ కేంద్రంలో పేలుడు, ఆరుగురు దుర్మరణం
- ' ఉప్పెన' మేకింగ్ వీడియో చూడాల్సిందే
- మతిస్థిమితం లేని వ్యక్తిని.. కుటుంబంతో కలిపిన ఒక పదం
- రికార్డులు బ్రేక్ చేసిన అశ్విన్
- నవభారత నిర్మాణంలో యువత భాగం కావాలి: వెంకయ్య పిలుపు
- వీడియో : జపాన్ కేబినెట్ లో వింత శాఖ
- ‘మూడ్’మారుతోందా!: వచ్చే ఏడు 13.7 శాతం వృద్ధి !!
- సూరత్‌లో బీజేపీ కన్నా ఆప్‌కు ఎక్కువ ఓట్లు