శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Medchal - Jan 24, 2021 , 04:22:16

అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

బోడుప్పల్‌,   : అభివృ ద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం బోడుప్పల్‌ నరగపాలక సంస్థ పరిధిలోని 1,2,3,20,26వ డివిజన్లలో సుడిగాలి పర్యటన చేశారు. మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, కమిషనర్‌ బోనగిరి శ్రీనివాస్‌తో కలిసి రూ.68లక్షల నిధులతో చేపట్టిన సీసీరోడ్లు, భూగర్భ డ్రైనేజీ, పార్కు స్థలాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వీరారెడ్డి నగర్‌లో కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్యక్షుడు రాసాల మహేష్‌యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి సందర్శించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్స్‌, పండ్లు పంపిణీ చేసి అభినందించారు.కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కొత్త లక్ష్మీరవిగౌడ్‌, కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ మెంబర్స్‌ పాల్గొన్నారు.

 ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చారిత్రాత్మకం : మంత్రి 

రాష్ట్రంలో పేదరికం ఏ రూపంలో ఉన్నా దానిని అంతమొందించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనిచేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం బోడుప్పల్‌ కార్పొరేషన్‌ ఉప్పల్‌ డిపో పరిధిలో మేయర్‌ సామల బుచ్చిరెడ్డి,  కార్పొరేటర్లతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

 కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ 

 బోడుప్పల్‌ పర్యటనలో భాగంగా 10మంది లబ్ధిదారులకు మున్సిపల్‌ కార్యాలయంలో షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి చెక్కులను మేయర్‌ బుచ్చిరెడ్డితో కలిసి అందజేశారు. కమిషనర్‌ బి.శ్రీనివాస్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

 సీఎం రిలీఫ్‌ ఫండ్‌  చెక్కులు..

పీర్జాదిగూడ, జనవరి 23 : పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన  నరేందర్‌రెడ్డికి రూ.36, 400,  లక్ష్మీకి రూ.60 వేలు,  రూ.56 వేలు, శ్వేతకు రూ.22,500 లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డితో కలిసి మంత్రి మల్లారెడిడ లబ్ధిదారులకు శనివారం అందజేశారు. కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు  పాల్గొన్నారు.  

VIDEOS

logo