నేడే గట్టు మైసమ్మ జాతర

ఘట్కేసర్, జనవరి 23 : భక్తుల కొంగుబంగారంగా పిలుస్తున్న ఘట్కేసర్ గట్టు మైసమ్మ జాతరకు సర్వం సిద్ధం చేశారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పాలకవర్గం, దేవాదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ ఈ ఏర్పాట్లను చేపట్టింది. ప్రతియేడు సంక్రాంతి పండుగ తరువాత వచ్చే మొదటి, రెండో ఆదివారం ఉత్సవాలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా, ఆదివారం ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఘట్కేసర్ నుంచి వెళ్లే వరంగల్ ప్రధాన రహదారి పక్కనే గుట్టపై ఉండే ఈ ఆలయ జాతరకు ఘట్కేసర్లోని గ్రామాలతో పాటు, కీసర, బీబీనగర్,పోచంపల్లి, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల నుంచి భక్తుల వేల సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఘట్కేసర్ సీఐ ఎన్.చంద్రబాబు ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయం వద్ద, చుట్టు పక్కల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
గట్టు మైసమ్మ జాతర సందర్భంగా ఘట్కేసర్ మండలంలోని గ్రామాలతో పాటు, చుట్టు పక్కల వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు దర్శనానికి వచ్చే సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని ఘట్కేసర్ చైర్పర్సన్ పావనీ జంగయ్య యాదవ్ తెలిపారు.
తాజావార్తలు
- మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలి : ఎంపీ సోనాల్
- ఉమెన్స్ డే స్పెషల్: విరాట పర్వం నుండి అమెజింగ్ వీడియో
- మునగాలలో అదుపుతప్పి బోల్తాపడ్డ కారు.. మహిళ మృతి
- రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు: మహేష్
- వరుసగా మూడో రోజూ 18 వేల కరోనా కేసులు
- రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే
- కొల్లూరి చిరంజీవి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- మద్యం మత్తులో తండ్రిని చంపిన తనయుడు
- ఆర్ఆర్ఆర్ టీంతో కలవనున్న అలియా.. !